telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మరో ఇద్దరు టీడీపీ నుండి జంప్ అవడానికి సిద్ధం.. 

నెల్లూరు టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లా అర్బన్ టిక్కెట్ ఇప్పటికే మంత్రి నారాయణకు ఖారారు అయిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీలోని ఆశావహులు రూరల్‌పై కన్నేశారు. రూరల్ సీటుపై ఆదాల ప్రభాకర్‌, ఆనంజయకుమార్‌రెడ్డి, మైనారిటీ నాయకుడు అబ్ధుల్ అజీజ్ ఆశలు పెట్టుకున్నారు. అయితే అనేక సమీకరణాల మధ్య ఆ టికెట్‌ను ఆదాల ప్రభాకర్‌కు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే అధినేత నిర్ణయంతో తాను తీవ్రంగా నష్టపోయానని ఇటు జయకుమార్‌రెడ్డి..అటు అబ్ధుల్ అజీజ్ ఎవరికి వారు..ఆందోళనకు దిగుతుండటం టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. 
ఈ క్రమంలో అబ్దుల్ అజీజ్ ఏకంగా బాబు పై బహిరంగ విమర్శలకు దిగారు. టీడీపీలో మైనారిటీలకు స్థానం లేదని, తమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని కలక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఇక జయకుమార్ వైసీపీలోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును నమ్ముకున్నందుకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు.
అబ్దుల్ అజీజ్ కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆనం రాంనారాయణ రెడ్డి వైసీపీలో ఉన్న నేపధ్యంలో జయకుమార్ కూడా ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని నెల్లూరు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పాగా వేయాలనుకుంటున్న టీడీపీకి ఈ పరిణామాలు కాస్త ఇబ్బదికరంగానే మారాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుంన్నాయి.

Related posts