telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మిలాన్ -2022 : విశాఖ చ‌రిత్ర‌లో ఇవాళ గ‌ర్వించ‌త‌గ్గ రోజు

*విశాఖలో మిలాన్ -2022 విన్యాసాలు

*ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌకను సీఎం వైఎస్‌ జగన్‌ జాతికి అంకితం చేశారు
*మిలాన్ -2022కు విశాఖ వేదిక కావ‌డం గ‌ర్వ‌కార‌ణం..
*అరుదైన వేడుక‌, విన్యాసాల పండుగ‌
*విన్యాసాల్లో పాల్గొన్న వారింద‌రికీ అభినంద‌న‌లు..
*39దేశాలనౌక‌ల విన్యాసాల పండుగ మిలాన్‌2022
*విశాఖ ది సిటీ ఆఫ్‌ డెస్టినీ..
*విశాఖ చ‌రిత్ర‌లో ఇవాళ గ‌ర్వించ‌త‌గ్గ రోజు

మిలాన్‌-2022 ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను సీఎం వైఎస్‌ జగ​న్‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ…విశాఖపట్నంలో మిలాన్‌-2022 నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగ్గ రోజు అని అన్నారు.

ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం మీద డాల్ఫిన్‌ లైట్‌హౌస్‌, డాల్ఫిన్‌ నోస్‌, కృష్ణజింకను ముద్రించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ది సిటీ ఆఫ్‌ డెస్టినీ అని అన్నారు. సిటీ పరేడ్‌లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం జగన్‌ తెలిపారు.

ఇది అరుదైన వేడుక, విన్యాసాల పండగ అని అన్నారు. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో ఐఎన్‌ఎస్‌ విశాఖ చేరిందని తెలిపారు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న అందరికీ సీఎం జగన్‌ అభినందనలు తెలియజేశారు.

Related posts