telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

100 కోట్ల పెట్టుబడితో ఆస్పత్రులకు భూములు…

cm jagan ycp

కోవిడ్ పై సమీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్.. ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాల‌ని అధికారుల‌కు సూచించారు.. జిల్లా ప్రధాన కేంద్రాలు, ఆ జిల్లాల్లోని నగరాల్లో హెల్త్‌హబ్‌లను ఏర్పాటు చేయాల‌న్న ఆయ‌న‌.. రాష్ట్రంలో కనీసం 16 చోట్ల ఈ హెల్త్‌ హబ్‌లను ఏర్పాటు చేయాల‌ని.. జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి కలుపుకుని మొత్తం 16 చోట్ల హెల్త్‌ హబ్‌లు ఉండాల‌ని.. ఒక్కో చోట కనీసంగా 30 నుంచి 50 ఎకరాలు సేకరించాల‌ని.. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున కేటాయించాల‌ని ఆదేశించారు. మూడేళ్లలో కనీసంగా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాల‌ని సూచించారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. దీనివల్ల కనీసంగా 80 మల్టీ, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు వ‌స్తాయ‌న్న ఆయ‌న‌.. వీటితోపాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్యకళాశాలలు, నర్సింగ్‌కాలేజీలు వస్తున్నాయ‌ని తెలిపారు.. ప్రభుత్వ పరంగా ఆరోగ్య రంగం బలోపేతం కావడంతోపాటు, మనం ఇచ్చే ప్రోత్సాహం కారణంగా ప్రైవేటు రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వ‌స్తాయ‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేసిన సీఎం.. ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లాకేంద్రంలో, కార్పొరేషన్లలో మల్టీస్పెషాల్టీ, స్పెషాల్టీ ఆస్పత్రులు వ‌స్తాయ‌న్నారు. దీనివల్ల టెరిషరీ కేర్‌ విస్తృతంగా మెరుగుపడుతుంద‌ని.. ఇతర ప్రాంతాలకు వైద్యానికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండ‌ద‌న్నారు. ఒకనెలరోజుల్లో కొత్త‌ పాలసీని తీసుకురావాలని అధికారుల‌ను ఆదేశించారు ఏపీ సీఎం.

Related posts