telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పవన్ ఢిల్లీ వెళ్లి స్టీల్ ప్లాంట్ ను కాపాడమని అడిగారా…?

Ambati Rambabu ycp

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ… విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయించటం బాధాకరమన్న ఆయన.. కేంద్రం పునరాలోచించే విధంగా ఒత్తిడి తీసుకుని రావాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. ఇక, పవన్ కల్యాణ్ మాటలు విని ఆశ్చర్యం వేసిందన్నారు అంబటి.. బీజేపీతో భాగస్వామిగా ఉండి పవన్ మా మీద బురద చల్లటం విచిత్రంగా ఉందన్న ఆయన.. పవన్.. ఢిల్లీ వెళ్లి స్టీల్ ప్లాంట్ ను కాపాడమని అడిగారా? లేక తిరుపతి సీటు ఇవ్వమని బతిమాలుకున్నారా? అని ఎద్దేవా చేశారు. మా మీద ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ చేస్తున్న బుద్ధిమాలిన పని అని ఫైర్ అయ్యారు..  చంద్రబాబు అండ్ కంపెనీ.. సీఎం వైఎస్‌ జగన్.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్ముతున్నారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు.. కేంద్ర రంగ సంస్థను రాష్ట్రం ఎలా అమ్మగలుగుతుంది అనే ఆలోచన కూడా లేదా? అని ప్రశ్నించిన ఆయన.. ఆ అవకాశం ఉంటే చంద్రబాబు ఎప్పుడో అమ్మేసి ఉండేవారు కాదా? అంటూ ఎద్దేవా చేశారు. లాభాల్లో నడిచిన విశాఖ స్టీల్‌ ప్లాంట్.. చంద్రబాబు అధికారంలోకి రాగానే నష్టాల్లోకి వెళ్లిపోయిందన్నారు అంబటి… 54 ప్రభుత్వ సంస్థలను చంద్రబాబు తన హయాంలో పప్పు బెల్లాల లాగా తన వారి చేతుల్లో పెట్టింది నిజం కాదా? అంటూ నిలదీసిన ఆయన.. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Related posts