telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మేమంతా స్ఫూర్తి పొందుతున్న నిజమైన “గ్యాంగ్ లీడర్” : నాని

Gang-Leader

ఈరోజు (గురువారం) మెగాస్టార్‌ చిరంజీవి తన 64వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తన నటనతో, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించి మెగాస్టార్‌గా పదిలమైన స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. నిన్న శిల్ప క‌ళావేదిక‌లో జ‌రిగిన చిరు 64వ బర్త్‌డే వేడుక‌లకి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుకకు భారీగా అభిమానులు హాజరయ్యారు. ఇక అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా చిరంజీవికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని కూడా మెగాస్టార్‌కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. “గ్యాంగ్ లీడర్” పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నాని నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి జన్మదినోత్సం సందర్భంగా “గ్యాంగ్ లీడర్” బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ఫోటోను నాని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. “మా సినిమాలోని ఈ షాట్.. క్లాసిక్ గ్యాంగ్ లీడర్‌కు ఓ ట్రిబ్యూట్ లాంటిది. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఆ షాట్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేస్తున్నాం. హ్యాపీ బర్త్‌డే సర్… మేమంతా స్ఫూర్తి పొందుతున్న నిజమైన గ్యాంగ్ లీడర్ మీరు” అని నాని ట్వీట్ చేశాడు.

Related posts