telugu navyamedia
సినిమా వార్తలు

“చిరంజీవి”గా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను : చంద్రబాబు నాయుడు

Chiranjeevi

ఈరోజు (గురువారం) మెగాస్టార్‌ చిరంజీవి తన 64వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తన నటనతో, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించి మెగాస్టార్‌గా పదిలమైన స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. నిన్న శిల్ప క‌ళావేదిక‌లో జ‌రిగిన చిరు 64వ బర్త్‌డే వేడుక‌లకి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుకకు భారీగా అభిమానులు హాజరయ్యారు. ఇక అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా చిరంజీవికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ఎలాంటి సీనీ నేపథ్యం లేకున్నా స్వయం కృషితో ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న చిరంజీవికి ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవే తమ స్ఫూర్తి అంటూ కొనియాడుతున్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం విశేషం. “స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చంద్రబాబు ట్విట్ చేశారు. ఓ కార్యక్రమంలో చిరంజీవితో నవ్వుతూ మాట్లాడుతున్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “హ్యాపీ బర్త్‌‌ డే మెగాస్టార్ చిరంజీవి” అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు.

Related posts