telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ దీక్షకు నేటికి పదేళ్లు.. కవిత ట్వీట్‌

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్‌ దీక్షకు నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్‌ 2009న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ సమాజం యావత్తు వెంట నిలవడంతో.. కేంద్రం మెడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్‌ స్ఫూర్తిని, జ్ఞాపకాలను, పోరాటాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఈ మేరకు భావోద్వేగ ట్వీట్‌ కూడా చేశారు. “కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో, ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు దీక్షా దివస్(నవంబర్ 29, 2009) కు నేటితో పదకొండేళ్లు. యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి, ఢిల్లీ పునాదులను కదిలించిన దీక్షా దివస్ స్పూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమవుదాం. కేసిఆర్ గారికి అండగా ఉందాం” అంటూ కవిత పేర్కొన్నారు. అటు మంత్రి కేటీఆర్‌ కూడా దీనిపై ట్వీట్‌ చేశారు. “తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష” అంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు.

Related posts