telugu navyamedia
సినిమా వార్తలు

“మహర్షి” అప్డేట్ : చెన్నై షెడ్యూల్ పూర్తి

Mahesh-with-Maharshi-Team

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా రూపొందుతోంది. ఓ మామూలు మనిషి .. ‘మహర్షి’ ఎలా అయ్యాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడంతో, ఆయన అభిమానులంతా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. డిఫరెంట్ లుక్ తో మహేశ్ బాబు నుంచి వచ్చిన ఫస్టులుక్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతోంది. గతకొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ షూటింగు పూర్తయ్యింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక అల్లరి నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.

Related posts