telugu navyamedia
సినిమా వార్తలు

“మాయ” చేసేస్తున్న “మజిలీ” వీడియో సాంగ్

“మజిలీ” చిత్రం నుండి నాలుగో పాటను యూనిట్ విడుదల చేసింది. నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంక కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం మజిలీ. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే టీజ‌ర్‌తో పాటు మూడు పాటలు విడుద‌ల చేసిన చిత్రబృందం తాజాగా “మాయ మాయ…” అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుద‌ల చేశారు. ఈ పాట ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. గోపిసుందర్ సంగీతం అందించిన దివ్యాంశ కౌశిక్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఇటు యూత్, అటు కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Related posts