telugu navyamedia
political Telangana

కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు:  కేటీఆర్‌

KTR Counter pawan comments
నీతిఆయోగ్‌ ఎన్ని సిఫారసులు చేసినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పథకాలకు కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప.. నిధులు రాలేదన్నారు.  కాబట్టి మన సంఖ్యా బలాన్ని పెంచుకుంటే నిధులు వరదలా వస్తాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.
మోదీ పాలన పట్ల దేశవ్యాప్తంగా విముఖత వచ్చిందని, బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.16 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి ఢిల్లీకి పంపితే మన హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు.  రైతులకు మేలు చేసే పథకాలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టలేదు. తెలంగాణ రైతుబంధును ఇప్పుడు కేంద్రంతో పాటు  చాలా రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయన్నారు.  కేసీఆర్‌ను విమర్శించే చంద్రబాబు కూడా రైతుబంధును కాపీ కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

అవుటర్ రింగురోడ్డుపై కారుతో పరారైన స్వామీజీ డ్రైవర్

vimala p

మద్యపాన నిషేధంపై జగన్ నిర్ణయం అభినందనీయం: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

vimala p

లండన్‌ : … ప్రజాదరణ కోల్పోతున్న .. బ్రిటిష్ ప్రధాని..

vimala p