telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ

జమ్మూ బస్టాండ్ లో గ్రనేడ్ దాడి చేసింది మైనర్ బాలుడే!

intelligence warning on terrorist attacks
జమ్మూ బస్టాండ్‌లో నిన్న  ప్రయాణికులపై గ్రెనేడ్‌ విసిరి పారిపోయిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలుడు యాసిర్‌ భట్‌ ఈ దాడి చేశాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని ఓ చెక్ పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ సెక్యూరిటీని తప్పించుకుని అతను ఎలా దాడికి పాల్పడ్డాడు అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.
పట్టుబడిన అనంతరం నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులతో పాటు సీసీటీవీ కెమెరాలను పరిశీలించడంతో నిందితుడిని త్వరగా పట్టుకోగలిగారు. యూట్యూబ్ లో వీడియోలను చూసి నిందితుడు గ్రనేడ్ తయారుచేశాడని పోలీసులు తెలిపారు. దాన్ని టిఫిన్ బాక్సులో పెట్టుకుని వచ్చి బస్టాండ్ వద్ద దాడికి పాల్పడ్డాడని అన్నారు. నిందితుడు కుల్గాం జిల్లా హిజ్బుల్ చీఫ్ ఫరూక్ అహ్మద్ భట్ తో టచ్ లో ఉన్నాడని జమ్మూ ఐజీ మనీష్‌ సిన్హా వెల్లడించారు.

Related posts