telugu navyamedia
సినిమా వార్తలు

అతడు నా ఛాతి మీద కొట్టాడు : కంగనా రనౌత్

Kangana Ranaut images

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్ ఎల్లప్పుడూ సామాజిక సమస్యలపై గొంతెత్తి తనవంతుగా పోరాడుతూనే ఉంటుంది. తాజాగా ఆమెకు తన చిన్నతనంలో ఎదురైన ఈవ్ టీజింగ్ గురించి వెల్లడించారు. అమీర్ ఖాన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ చలనచిత్రాలు సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్నాయి అనే విషయం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొనె, పరిణీతి చోప్రా, కంగనా రనౌత్ కన్పించారు.

ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ ఆమె పాఠశాలకు వెళ్ళినప్పుడు ఒక బైకర్ వల్ల ఎదుర్కొన్న ఈవ్ టీజింగ్ గురించి వెల్లడించింది. “నాకు గుర్తుంది. నేను చండీఘర్ పాఠశాలలో చదువుతున్నప్పుడు అబ్బాయిలు బైక్ లపై వెళ్తూ అమ్మాయిలను తాకడానికి ప్రయత్నించేవారు. ఒకసారి ఒక బైకర్ చాలా వేగంగా నా వైపుకి వచ్చి నా ఛాతీపై కొట్టాడు. ఆ హఠాత్పరిణామానికి షాకైన నేను 5 నిమిషాల వరకు తేరుకోలేకపోయాను. ఆలా తేరుకోగానే నాకు వచ్చిన మొదటి ఆలోచన “ఎవరైనా దీనిని చూశారా ?” అంటూ కంగనా తనకు ఎదురైన ఘటనను చెప్పుకొచ్చింది. ఇది విన్న పరిణీతి చోప్రా స్పందిస్తూ “ఇలాంటి సందర్భంలో ప్రజలు అమ్మాయే ఏదో తప్పు చేసినట్టుగా ఆలోచిస్తారు” అని అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కంగనా “మణికర్ణిక” చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు “మెంటల్ హై క్యా” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts