telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ 3 : .. రోహిణి ఎలిమినేషన్ …

rohini eliminated in bigg boss 3

ఈ వారం బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ -3లో మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఈసారి హౌస్ నుంచి రోహిణి బయటకు వెళ్ళింది. ఎలిమినేషన్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఒకటి, రెండు రోజులు ముందుగానే చిత్రీకరిస్తుండటంతో, ప్రతివారమూ ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తున్నారన్న విషయం ముందుగానే లీకై పోతున్న సంగతి తెలిసిందే.

ఈ వారంలో కిచెన్‌ లో గొడవ, వితికా, వరుణ్ మధ్య గుసగుసలు, రవికృష్ణ, అషూల మధ్య సంభాషణ, పునర్నవి, రాహుల్‌ల చర్చలు హైలెట్ గా నిలిచాయి. ఈ వారం శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణి ఎలిమినేషన్ జోన్ లో ఉండగా, శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌ సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్టు నాగ్ ప్రకటించేశారు. హౌస్ లో అవార్డుల హంగామా, తదితర విషయాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

Related posts