telugu navyamedia
సినిమా వార్తలు

“కల్కి” ఫారెస్ట్ థీమ్ ఫైట్ వీడియో సాంగ్

kalki movie first look

రాజశేఖర్‌ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ “కల్కి”. అదా శర్మ, నందితా శ్వేత నాయికలు. పూజితా పొన్నాడ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించగా… స్కార్లెట్‌ విల్సన్‌ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. శివానీ, శివాత్మిక సమర్పణలో సి. కళ్యాణ్‌ నిర్మించారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రం. 1983 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథ ఇది. ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కన్పించాడు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వ‌చ్చాయి. కలక్షన్స్ పరంగా నిలదొక్కుకోలేక పోయింది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్రం నుంచి “ఫారెస్ట్ థీమ్ ఫైట్” అంటూ వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ప్రస్తుతానికి రాజశేఖర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఆయన కూతుళ్ళిద్దరూ తమ మొదటి సినిమాతో బిజీగా ఉన్నారు. రాజశేఖర్ రెండవ కూతురు శివాత్మిక, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ జంటగా నటిస్తున్న “దొరసాని” చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts