telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే తట్టుకోలేక అభాండాలు: జగన్

ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే తట్టుకోలేక చంద్రబాబు అభాండాలు వేస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఏలూరులో వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలపై జగన్ మండిపడ్డారు.

రాష్ట్ర రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో అందరూ చూస్తున్నారని అన్నారు. గాంధీ జయంతి రోజున దేశంలో కనీవినీ ఎరుగని విధంగా గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థను ప్రారంభించామని చెప్పారు. గాంధీ జయంతి రోజున ఎక్కడైనా మందు షాపు తెరిచి ఉందా? అని మీ అందరినీ అడుగుతున్నానని ప్రశ్నించారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్టపగలే అబద్ధాలు మాట్లాడటం సబబేనా? అని ప్రశ్నించారు.. ఇలాంటి రాజకీయాలను చూసినప్పుడు మనసుకు బాధ కలుగుతుందన్నారు.

Related posts