telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

మరో జ్యూవెలర్స్ సంస్థ భారీ స్కాం.. 2వేలకోట్ల మేర కుచ్చుటోపీ..

IMA jewellers scam about 2000 crs

ఐఎంఏ జ్యూవెలర్స్ సంస్థ అధినేత మన్సూర్ ఆలీ ఖాన్ వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేయడంతో అతనితో పాటు అనేక మందిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారితో పాటు అనేక మంది ప్రభుత్వ అధికారులను సీబీఐ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఐఎంఏ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే బెళగావి జిల్లాలోని చిళకవాడి లోకమాన్య మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సోసైటీ బ్రాంచ్ కు చేరుకున్న అధికారులు అక్కడి రికార్డులు పరిశీలిస్తున్నారు. లోకమాన్య మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సోసైటీలో కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలకు చెందిన వేలాది మంది ప్రజలు సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా డిపాజిట్లు చేశారని, ఆ నగదును ఎంఇఎస్ నాయకుడు కిరణ్ ఠాకూర్ దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో విచారణ మొదలైయ్యింది.

భాదితులు శాసన సభ్యుడు అభయ్ పాటిల్ తో పాటు 60 మంది ఎమ్మెల్యేలు, కేంద్ర ఆర్థిక శాఖ, కర్ణాటక ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. కేసు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే కో ఆపరేటివ్ సోసైటీ అధికారులకు, సంబంధిత అధికారులకు, పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలో ఐఎంఏ స్కాం కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 2,000 కోట్ల స్కాం బయటకు రావడంతో రాజకీయ నాయకులతో పాటు ప్రజలు ఉలిక్కిపడ్డారు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఇఎస్) పార్టీ నాయకుడు ఈ భారీ స్కాంలో కింగ్ పిన్ అని అధికారుల విచారణలో వెలుగు చూడటంతో కలకలం రేపింది. ఎంఇఎస్ పార్టీ నాయకుడు కిరణ్ ఠాకూర్ కు చెందిన బెళగావిలోని లోకమాన్య మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సోసైటీ కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిందని వెలుగు చూసింది. ప్రజల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన తరువాత వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని సమాచారం. మోడీగారు నల్లధనం వెలికితీత తరువాత, ముందు ఇలాంటి స్కాం లు జరగకుండా ముందస్తు జాగర్తలు చేపట్టండి.. అదే పదివేలు అంటూ బాధితులు మొరపెట్టుకోవడం కొసమెరుపు. ఏదిఏమైనా రాజకీయనేతల అండదండలు లేకుండా ఇలాంటి స్కాం లు జరగవు.. ఇదంతా దొంగల చేతికి తాళాలు ఇచ్చిన చందంగానే ఉంది. ఇలాంటి వారందరు ఆయా పార్టీలకు ఫండ్ రూపేణా ఎంతెంత ఇచ్చారో ఆయా పార్టీలే చెప్పాలి మరి! అది జరిగేపని కాదు కాబట్టి, ఇలాంటివారిని పట్టుకోవడం కూడా ఈ ప్రభుత్వాల తరం కాదని స్పష్టమైన రహస్యం లాంటి సత్యం… కాదంటారా..!

Related posts