టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. కొన్నిరోజుల క్రితమే బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగ్గా, తీర్పును న్యాయస్థానం రిజర్వ్ లో ఉంచింది.
అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగాలేదని, విచారణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారని ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించినా ఏసీబీ న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. తాజాగా ఈ బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు ఏసీబీ కోర్ట్ ప్రకటించింది.