telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో.. రోజర్‌ ఫెదరర్‌ను ఓడించి.. ఫైనల్ కు చేరిన నోవాక్‌ జకోవిచ్‌ …

australia open novac jakovich to finals

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భాగంగా నేడు జరిగిన తొలి సెమీ ఫైనల్లో టెన్నిస్‌ దిగ్గజం, సెర్బియన్‌ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌.. స్విస్‌ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ను ఓడించాడు. దీంతో అతడు 8వ సారి ఈ టైటిల్‌ను సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ రోజు జరిగిన రసవత్తరమైన పోరులో జకోవిచ్‌ తొలుత తడబడినా తర్వాత బాగా పుంజకున్నాడు. 7-6 (7/1), 6-4, 6-3 తేడాతో ఫెదరర్‌ను ఓడించి ఇంటిముఖం పట్టించాడు.

రేపు(శుక్రవారం) జరిగే రెండో సెమీస్‌లో ఎవరు గెలిస్తే.. జకోవిచ్‌ వారితో ఆదివారం ఫైనల్లో తలపడనున్నాడు. జకోవిచ్‌ ఇప్పటివరకు ఏడుసార్లు ఈ టోర్నీలో ఫైనల్‌ చేరి అన్నిసార్లు టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌, ఏడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ రెండో సెమీస్‌లో తలపడతారు. వీరిలో ఎవరు గెలిస్తే వారు.. జకోవిచ్‌తో ఆదివారం టైటిల్‌ పోరులో తలపడనున్నారు.

Related posts