టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న రామ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.
కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న వీళ్లిద్దరూ ఇంట్లో వాళ్లను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారట. ఆగస్టులో నిశ్చితార్థం, నవంబరులో పెళ్లి జరగొచ్చని ప్రచారం సాగుతోంది.
ఇకపోతే రామ్ నటించిన వారియర్ జూలై 14న తెలుగు, తమిళంలో రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా నటించింది. మరోవైపు రామ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుందీ చిత్రం
అమ్మ బయోపిక్ ను ఎవరు తీసినా అది సినిమానే… మేము చేసేది మాత్రం ఆమె జీవితం : నిత్యామీనన్