telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ప్లాస్టిక్ బాటిళ్ల లో అమ్మతున్న మినరల్ వాటర్ ని తాగుతున్నారా..అయితే ఈ విషయాలు తెలుసుకోండి !

అసలు మన శరీరానికి అవసరమైన క్యాల్షియం, సోడియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం లాంటి గొప్ప మినరల్స్ మనకు మనం త్రాగే మంచి నీళ్ల నుండీ అధికంగా అందుతాయి. కానీ మనం ప్రస్తుతం త్రాగుతున్న మినరల్ వాటర్ అనే నీళ్లలో ఇవన్నీ ఏమి ఉండవు. అంతే కాకుండా ఆ నీళ్లు అందంగా కనపడడానికి మరియు టేస్ట్ బాగా ఉండడానికి కొన్ని రసాయనాలు కలిపి ఆ వాటర్ ని మనకి అమ్ముతున్నారు.వీటి కారణంగా మన ఎముకలకు అందాల్సిన క్యాల్షియం సరిగా అందదు. అందుకే తక్కువ వయసులో ఉన్న వారికి కూడా కాళ్ళు, చేతులు మరియు మోకాళ్ళ నొప్పి వస్తుంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, ఎక్కువ జబ్బుల బారిన పడటం జరుగుతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిళ్ల లో అమ్మబడుతున్న మినరల్ వాటర్ ని త్రాగకండి.
మన ఇళ్లలో ఉన్న మంచినీళ్లను కాచి చల్లార్చి ఒక రాగి పాత్రలో పోసి ఉంచి ఆ నీళ్లను రోజుకు 4 నుండి 5లేటర్లు త్రాగండి. చాలా ఆరోగ్యంగా వుంటారు. ఒకవేళ రాగిబిందెలు లేని వాళ్ళు ఒక మట్టి కుండలో కాచి చల్లార్చిన నీళ్లను పోసి అందులో ఒక రాగి ముక్క ని వేయండి. ఆ నీళ్లను రోజుకి 4నుండి5 లీటర్ల నీళ్ళని త్రాగండి. ఇలా చేయడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ప్రతి గంటకి ఒక గ్లాస్ నీళ్లు త్రాగడం చాలా మంచిది.

Related posts