telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బ్యాంకులకు వరుసగా సెలవులు : మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 4 వరకు !

bank strike

ఖాతాదారులకు షాక్‌.. బ్యాంకులకు వరుసగా సెలవులు : మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 4 వరకు !
మార్చి నెల ఏమో కానీ బ్యాంకులకు వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో ఖాతాదారులకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. సమ్మె కారణంగా ఇప్పటికే.. 2 రోజులు బ్యాంకులు మూతపడగా.. తాజాగా బ్యాంకు లావాదేవీలు చేసే వారికి మరో షాక్‌ తగలనుంది. ఎందుకంటే… మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 4 వరకు చూస్తే.. కేవలం 2 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఆర్‌బీఐ బ్యాంక్‌ హాలీడేస్‌ ప్రకారం.. బ్యాంకులు దాదాపు వారం రోజులు పనిచేయకపోవచ్చు. అయితే.. ఈ సెలవులు ప్రాంతం ప్రాతిపదికన మారతాయి. మార్చి 27 నుంచి 29 వరకు అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకులు పని చేయవు. 27న నాలుగో శనివారం కాగా… 28న ఆదివారం, 29న హోలీ పండుగ. అందువల్ల ఈ మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే మార్చి 30న పాట్నాలో బ్యాంకులకు సెలవు ఉండగా.. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు లభించవు. అలాగే ఏప్రిల్‌ 1న కూడా బ్యాంక్‌ సేవలు సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉండవు. ఇక ఏప్రిల్‌ 2న గుడ్‌ ఫ్రైడే. అంటే బ్యాంకులు 9 రోజుల్లో దాదాపు 7 రోజులు పనిచేయవని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖాతాదారులు ఇప్పుడే ఏమైనా లావాదేవీలు ఉంటే త్వరపడండి. లేకపోతే.. అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

Related posts