telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

9 ఏళ్ళ కూతురిపై అత్యాచారం చేస్తూ భార్య కంటబడ్డ భర్త… తరువాత…

Crime

అమెరికాలోని లూసియానాలో పనిమీద బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన ఓ భార్య కన్పించిన దృశ్యం ఆమెను షాక్ కు గురిచేసింది. ఇంట్లో వదిలి వెళ్లిన తన 9 ఏళ్ల పాపపై ఆమె భర్త అత్యాచారం చేస్తూ కన్పించాడు. ఇంకేముంది దాన్ని చూసిన ఆమె కోపం కట్టలు తెంచుకుంది. ఏం చేస్తున్నావంటూ భర్తను నిలదీయగా… 42 ఏళ్ల గ్లెన్ మిల్స్ జూనియర్ భార్యకు ఏదో సమాధానం చెప్పబోయాడు. భర్త మాటలు వినిపించుకోకుండా అతని భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దాంతో ఆమెపై దాడి చేసి తన ట్రక్కులో పారిపోయాడు గ్లెన్. విషయం తెలుసుకున్న పోలీసులు గ్లెన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే గురువారం మధ్యాహ్నానికల్లా గ్లెన్‌‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అతన్ని జెఫర్‌సన్ పారిష్ కరెక్షనల్ సెంటర్‌లో ఉంచారు. ఇలాంటి కసాయి తండ్రుల్ని ఏం చేసినా పాపం లేదంటూ పాప తల్లి కన్నీటి పర్యంతమైంది.

Related posts