telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు కాపు నేతలతో చంద్రబాబు సమావేశం

chandrababu meeting on voting and success

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు పార్టీ కాపు సామాజిక వర్గం నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాలపై ఈ సమావేశంలో అధినేత కాపు నాయకులతో చర్చించే అవకాశం ఉంది.

చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా పార్టీకి చెందిన బోండా ఉమ, తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ తదితర కాపు నాయకులు కాకినాడలో భేటీ అయిన విషయం తెలిసిందే. పార్టీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో మరికొందరు పార్టీనీ వీడనున్నారని ప్రచారం జరైగింది. అయితే సమావేశం అనంతం కాపు నేతలు అంతర్గత అంశాలపై చర్చించేందుకే తాము సమావేశమయ్యామని, పార్టీ మారే యోచన తమకు లేదని స్పష్టం చేశారు.

బాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ప్రజావేదిక కూల్చివేత నేపథ్యంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి కాపు నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమయ్యింది. దీంతో వీరి పార్టీ మారే అవకాశాలపై ఇంకా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించాలని చంద్రబాబు వారితో భేటీ కావాలని నిర్ణయించారు.

Related posts