telugu navyamedia
crime news

బస్సులో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. అరెస్టు చేసిన పోలీసులు!

ARREST crime

బస్సులో పక్కన కూర్చున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఓ మహిళ టికెట్లు బుక్ చేసుకుం ది. ఇదే బస్సులో పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ యువకుడు ఆమె పక్క సీటులో కూర్చుని ప్రయాణిస్తున్నాడు. ప్రయాణం ప్రారంభించాక సదరు యువకుడు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఎంతచెప్పిన వినక పోవడంతో ఆమె వంద నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.

దీంతో బస్సు అనంతపురం జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడికొండ చెక్ పోస్టు వద్దకు వచ్చేసరికి పోలీసులు ప్రత్యక్షమయ్యారు. బస్సును ఆపి బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలమత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Related posts

హైదరాబాద్ లో .. మళ్ళీ చెడ్డీగ్యాంగ్ హల్ చల్.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు..

vimala p

కాంగ్రెస్ సీనియర్‌ నేతలకు ఇంటెలిజెన్స్‌ నోటీసులు

vimala p

అమరావతి : …రాష్ట్ర గవర్నర్ తో భేటీ కానున్న.. రాజధాని రైతులు.. 

vimala p