telugu navyamedia
క్రైమ్ వార్తలు

తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం

Road accident 8 dead and 30 injured

హైదరాబాద్ తార్నాకలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని అతి వేగంగా దూసుకువచ్చిన ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తార్నాక డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బైక్‌ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ట్రక్ వేగంగా వచ్చి డీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరోవ్యక్తిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts