telugu navyamedia
క్రీడలు వార్తలు

సిరాజ్ పై సెహ్వాగ్ ప్రశంసలు…

ఆసీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత సినియర్ బౌలర్లు అందరూ గాయాలతో దూరం కావడంతో యువ పేసర్లు జట్టులోకి వచ్చారు. అయితే ఈ టెస్టు సిరీస్‌లో మహ్మద్‌ సిరాజ్‌ అంద్భుతంగా రాణిస్తుండటంతో అతను పెద్దోడైపోయాడు అని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అయితే మొదటి టెస్ట్ లో సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ గాయపడటంతో 26 ఏళ్ల బాక్సింగ్ డే టెస్ట్‌లో అవకాశం అందుకున్న సిరాజ్ మొత్తం 5 వికెట్లు పడగొట్టడంతో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో టెస్ట్ తర్వాత ఉమేష్ యాదవ్‌ గాయం కారణంగా తప్పుకోవడంతో మూడో టెస్టులో బుమ్రా తర్వాత జట్టులో రెండో సీనియర్ పేస్ బౌలర్ గా నిలిచింది సిరాజ్. ఇక చివరి టెస్ట్ నుండి గాయం కారణంగా బుమ్రా కూడా తప్పుకోవడంతో పేస్ దళానికి నాయకుడు అయ్యాడు. అయితే ఈ చివరి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసిన సిరాజ్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టి టెస్ట్ క్రికెట్ లో తన మొదటి 5 వికెట్ హల్ ను సాధించాడు. ఇక ఈరోజు మ్యాచ్ అనంతరం సెహ్వాగ్ సిరాజ్‌ను ప్రశంసిస్తు… “ఈ పర్యటనలో సిరాజ్ పెద్దోడైపోయాడు… ఈ పర్యటనలో భారత యువకుల ప్రదర్శన చాలా కాలం పాటు అందరికి గుర్తుండిపోతుంది” అని అన్నాడు. అయితే ఈ సిరీస్ ను భారత్ సొంత చేసుకోవాలంటే రేపటి ఆటలో 324 పరుగులు చేయాల్సి ఉంటుంది. చూడాలి మరి రేపటి ఆటలో ఏం జరుగుతుంది అనేది.

Related posts