telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అసలు ఏం జరిగిందో చెప్పిన జోమాటో డెలివరీ బాయ్…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జోమాటో డెలివరీ బాయ్ ఘటన పై చర్చ నడుస్తుంది. తన ముక్కుపచ్చడైపోయిందంటూ.. వీడియో తీసిన బాధితురాలు.. ఈ ఘటనపై జోమాటోకు, పోలీసులకు ఫిర్యాదు చేయడం..  దీనిపై స్పందించిన జోమాటో యాజమాన్యం.. ఆమెకు క్షమాపణలు చెప్పడంతో పాటు భరోసా కల్పించింది.. ఇలాంటి దాడులను తాము సహించమని, సరైన చర్యలు తీసుకుంటామని చెప్పి.. దానికి అనుగుణంగానే నిందితుడిపై చర్యలు కూడా తీసుకుంది.. వైద్య ఖర్చులు కూడా భరిస్తామని తెలిపింది. అయితే, ఈ కేసులు ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.. సదరు మహిళే తన ముక్కుపై తన ఉంగరంతోనే కొట్టికున్నట్టు చెబుతున్నాడు జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజ్.. సదరు మహిళ హితేషా చంద్రనీ.. నన్ను బానిస అంటూ పిలిచింది.. ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది.. దాడి చేసింది.. దీంతో.. ఆర్డర్ క్యాన్సిల్ చేశాను.. కానీ, ఆ మహిళ.. ఫుడ్‌ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.. కానీ, ఈ ఘటనలో నాపై చర్యలు తప్పలేదని.. నా అమాయకత్వాన్ని నిరూపించడానికి అక్కడ సిసిటివి ఫుటేజ్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts