telugu navyamedia
సినిమా వార్తలు

ఎవడొస్తాడో… ఎవడాపుతాడో చూస్తా… ఫైర్ అయిన తేజ

Bellamkonda Sreenivas, Kajal Aggarwal,Teja,‘SITA’

తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం “సీత‌”. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఈ చిత్రంలో సోనూసూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా మంచి స్పందన లభించింది.

మే 24న విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జ‌రుపుకుంటుంది. అయితే ఈ సినిమా టైటిల్‌కు, అందులో సంభాష‌ణలు, స‌న్నివేశాలపై ఓ హిందూ వాద సంస్థ సినిమా విడుద‌ల‌కు అభ్యంతరాన్ని వ్య‌క్తం చేసింది. అయితే దీనిపై స్పందించిన ద‌ర్శ‌కుడు తేజ “సీత సినిమాకు “సీత” అని కాకుండా శూర్ప‌ణ‌క అని టైటిల్ పెట్టాలా? అస‌లు టైటిల్ నేనెందుకు మార్చాలి ? నేను మార్చ‌ను. అలాగే సినిమాను ఎవ‌రికీ చూపించ‌ను.

సినిమా సెన్సార్ అయ్యింది. కాబ‌ట్టి ఎవ‌రికీ సినిమాను చూపించాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌డొస్తాడో చూస్తాను. సినిమా 24 ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల‌వుతుంది. ఎవ‌డాపుతాడో చూస్తా” అంటూ ఘాటుగా స్పందించారు.

Related posts