కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో రాహుల్ విజయం సాధించారు. మరోవైపు గాంధీ-నెహ్రూ కుటుంబం కంచుకోట అయిన అమేథిలో మాత్రం రాహుల్ ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. ఇక్కడ బెజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
వయనాడ్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి కాంగ్రెస్ ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తోంది. దీంతో దక్షిణాది నుంచి పోటీ చేయాలని రాహుల్ భావించారు. వయనాడ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో రాహుల్ అమేఠీ ప్రజలకు అందుబాటులో లేకపోయారు. దీంతో అక్కడి ఓటర్లు ఈసారి స్మృతి ఇరానీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ గడ్డపై 40 వేల మంది టెర్రరిస్టులు ట్రైనింగ్: ప్రధాని ఇమ్రాన్