telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎంతో మంది కుట్ర‌లు ప‌న్నినా గుండె బెద‌ర‌లేదు..నా సంక‌ల్పం చెద‌ర‌లేదు

*అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన వైసీపీ పీన్లరీ స‌మావేశాలు.
*పార్టీ అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ ప్రారంభోప‌న్యాసం
*13 ఏళ్ళ కింద‌ట సంఘ‌ర్ష‌ణ మొద‌లైంది
*అవ‌మానాల‌ను, క‌ష్టాల‌ను భ‌రించి, నాతో ప్ర‌యాణించి..
వెన్ను ద‌న్నుగా ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ నా సెల్యూట్‌
*ఎన్నో వ్య‌వ‌స్థ‌లు క‌త్తి గ‌ట్టినా.. ఎంతో మంది కుట్ర‌లు ప‌న్నినా..నా గుండె బెద‌ర‌దు..నా సంక‌ల్పం చెద‌ర‌దు..

*ఈ జగ‌మంతా కుటుంబం ఏనాడు నా చెయ్యి వీడ‌లేదు
*చ‌రిత్ర‌లో చెర‌గ‌ని విధంగా న‌న్ను ఆశ్వీరించారు.
*అధికారం అంటే.. అహంకారం కాదు.. ప్రజల మీద మమకారం

వైసీపీ ప్లీనరీ సమావేశాలు అట్ట‌హాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. వేదికపై పార్టీ అధ్య‌క్షుడిగా సీఎం జగన్ ప్ర‌సంగిస్తున్నారు..

2009 సెప్టెంబర్‌ 25న పావురాల గుట్టలో మొదలైన సంఘర్షణ ఓదార్పు యాత్రతో పార్టీ ఒక​ రూపం దాల్చిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందన్నారు. అవ‌మానాల‌ను, క‌ష్టాల‌ను భ‌రించి, నాతో ప్ర‌యాణించి.. వెన్ను ద‌న్నుగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు నా సెల్యూట్‌ అని సీఎం అన్నారు.

ఈ 13 ఏళ్లలో ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఎన్నో వ్య‌వ‌స్థ‌లు క‌త్తి గ‌ట్టినా .. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు. సంకల్పం మారలేదు.నాన్న నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం నా చేయి ఎప్పుడూ వదల్లేదు. ప్రజలు మూడేళ్ల కిందట కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు అని సీఎం అన్నారు.

2019లో జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించాం. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు పరిమితం చేశాడు దేవుడు. అధికారం అంటే అహంకారం కాదని నిరూపించాం’’ అని సీఎం జగన్‌ అన్నారు.

Related posts