telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాల్లేవు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో భారతీయజనతాపార్టీది భిన్నాభిప్రాయాలు ఉండవని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో ఆయన ఎయిర్ పోర్టుకు చేరుకున్న సందర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు నిర్ణయమే మా నిర్ణయమన్నారు. విశాఖ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం సంపూర్ణంగా సహాయసహకారాలు అందిస్తుందన్నారు. దక్షిణ భారతదేశంలో పర్యాటక స్థావరానికి విశాఖ అనువైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, పర్యాటక శాఖ అధికారులు ఘనంగాస్వాగతించారు.

భారత టూరిజం శాఖకు సంబంధించి అధికారులతో చర్చించి విశాఖను టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి తగు చర్యలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కరోనా ప్రభావంతో టూరిజం అభివృద్ధి కుంటుపడిందన్నారు. భవిష్యత్తులో విశాఖ నగరంలో పూర్తిస్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.

Related posts