telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో రైతుల‌కు తీపి క‌బురు..

వైఎస్సార్‌ రైతుభరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం.. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. అన్నదాతలకు వైఎస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌ కింద పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమచేయనున్నారు.

YSR Rythu Bharosa Sunna Vaddi YSR Yantra Seva Funds Release Highlights - Sakshi

2021–22 సంవత్సరానికి సంబంధించి తొలివిడతగా మే 13న రూ.3,811.96 కోట్ల సాయం అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు రెండోవిడతగా 50.37 లక్షల మంది రైతులకు రూ.2052 కోట్లు అందిస్తోంది. ఈ ఏడాది లబ్ధిపొందుతున్న రైతు కుటుంబాల్లో 48,86,361 మంది భూ యజమానులు కాగా, అటవీభూములు సాగుచేస్తున్న వారు 82,251 మందితోపాటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాస్తవ సాగు(కౌలు)దారులు 68,737 మంది లబ్ధిపొందుతున్నారు. మూడు సంవత్సరాలుగా లబ్ధి పొందుతున్న వారిసంఖ్య పెరుగుతూ వస్తోంది.

వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకంలో రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద రాయితీ ఇస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఏడాది తిరక్కుండానే ఈ వడ్డీ రాయితీ సొమ్మును జమచేస్తోంది. ఈ సీజన్‌లో రూ.లక్షలోపు 11,03,228 మందికి రూ.6,389 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ–క్రాప్, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం వీరిలో 6.67 లక్షల మంది సున్నావడ్డీకి అర్హులుగా గుర్తించారు. ఈ జాబితాలను సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తున్నారు. ఇలా అర్హత పొందినవారి ఖాతాలకు వైఎస్సార్‌ సున్నావడ్డీ రాయితీ కింద రూ.112.70 కోట్లను ప్రభుత్వం జమచేస్తోంది.

Amid COVID-19, Andhra govt procures agri-produce worth Rs 1,100 cr | The News Minute

చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది జగన్‌ సర్కార్‌. వాటికి సంబంధించి సబ్సిడీ సొమ్ము రూ.25.55 కోట్లను రైతు గ్రూపులకు జమచేయనుంది. ఈ ఈ స్కీమ్‌ కింద రూ.2,134 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను 11,785 రైతుగ్రూపుల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మొత్తంలో 854 కోట్లు అంటే 40 శాతం మేర సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుండగా, 10 శాతం అంటే రూ.213 కోట్లు రైతు కమిటీలు భరిస్తున్నాయి. మిగిలిన 50 శాతంగా 1,067 కోట్లు బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. ఈ విధంగా రాష్ట్ర రైతులకు మేలు జరిగే విధంగా పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తోంది ప్రభుత్వం.

వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ నగదు జమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామన్నారు.మాది రైతు పక్షపాత ప్రభుత్వం. మూడో సంవత్సరం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నాం. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.18,777 కోట్లు విడుదల చేశామని’’ సీఎం పేర్కొన్నారు.

‘‘గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. కరువుసీమలో కూడా నేడు పుష్కలంగా సాగునీరు అందుతోంది. కరోనా సవాల్‌ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రూ.2,134 కోట్ల వ్యయంతో యంత్రసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చాం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ఈ-క్రాపింగ్‌ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని’’ సీఎం అన్నారు.

Related posts