ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సీజేఐ ఎన్వీ రమణ ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.
అక్టోబర్2న సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కారుతోపాటు మరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో జర్నలిస్ట్ సహా నలుగురు రైతులు మృతి చెందగా… అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో 68 మందిలో 30 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినట్టు ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది హరీష్ సాల్వే చెప్పారు. ఇందులో 23 మంది ప్రత్యక్ష సాక్షులున్నారని వెల్లడించారు.
వందల సంఖ్యలో రైతుల ర్యాలీ కొనసాగుతున్నప్పుడు, ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మంది మాత్రమేనా అని సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. మరింత మంది సాక్షులను సేకరించి వారికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు యూపీని ఆదేశించింది. “స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయడంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, న్యాయ అధికారులు అందుబాటులో లేకుంటే సమీపంలోని జిల్లా జడ్జిని సంప్రదించాలని ” సుప్రీం పేర్కొంది.
ఆధారాల రూపంలో మీడియా దృశ్యాలు అనేకం ఉన్నాయని.. వాటిని ధృవీకరించాల్సి ఉందని యూపీ సర్కారు పేర్కొంది. కారును చూసినవారు, కార్లో ఉన్న వ్యక్తులను చూసినవారు ఉన్నారని చెప్పింది. నిందితులుగా ఉన్న 16 మందిని గుర్తించామని యూపీ సర్కారు కోర్టుకు తెలిపింది.
ఏ కేసులోనై ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం కీలకమని, విశ్వసనీయం సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. సాక్షుల భద్రత గురించి సీజేఐ ఆరా తీశారు. యూపీ ప్రభుత్వ నివేదికలో దర్యాప్తులో పురోగతి ఉందని గ్రహించామని, సాక్షులకు భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అలాగే ..జర్నలిస్ట్ రమణ్ కశ్యప్ సహా చనిపోయిన నలుగురి వ్యవహారంపై రెండో ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. ఈ అంశంపై కూడా స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసిన స్టాలిన్