దేశంలో ఒక వైపు కరోనా తో సతమతమవుతుంటే..మరోవైపు డంగ్యూ జ్వరం విజృంభున జనాలకు అతాలకుతలం చేస్తున్నాయి .గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి,..వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ఎక్కువ పెరుగుతాయి. నీరు ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచిపోయి దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. పగటి పూట డెంగ్యూ దోమలు ఎక్కువగా కుడతాయిని వైద్యులు అంటున్నారు.
డెంగ్యూ లక్షణాలు..
డెంగ్యూలో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, అలసట, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు, వికారం , వాంతులు డెంగ్యూ లక్షణాలుగా పరిగణించవచ్చు. ఈ వైరస్ 4 నుంచి 10 రోజులు ఉంటుందని వైద్యులు అంటున్నారు.
అయితే తీవ్రమైన డెంగ్యూ లక్షణాల ఉన్న బాధితులు కొంతకాలం తర్వాత కోలుకుంటున్నట్లు కనిపిస్తాడు. కానీ 3 నుంచి 7 రోజుల తర్వాత పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది కానీ..చాలా నీరసంగా ఎక్కడపడితే అక్కడే పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం, రక్తం వాంతులు, వేగవంతమైన శ్వాస, అలసట లాంటి లక్షణాలు వీరిలో ప్రమాదకరంగా మారుతాయి. ఒక్కొసారి ప్రాణాలు కూడా ప్రమాదం ఉంటుంది.
డెంగ్యూ రాకుండా జాగ్రత్తలు..
*ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడాలి, చీకటి పడగానే తలుపులు, కిటికీలు వేసుకోవాలి.
*చుట్టుపక్కలా నీటి గుంటలు, చెత్త లేకుండా జాగ్రత్త పడాలి.
* పడుకునేపటప్పుడు కాళ్లు, చేతులు, శరీరాన్ని కవర్ చేసుకోవాలి.
*చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గున్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత * *దోమలను పూర్తిగా నియంత్రించాలి. నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. *ఒంటికి వేప నూనె, కొబ్బరి నూనె కలిపి పూసుకో వడం వల్ల ఆ వాసనకు దోమలు దగ్గరకు రావు.
*దోమలను పారదోలే మందులను ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు కాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
*ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. పాత సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.
*పూలకుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల దోమలు ఎక్కువ కాకుండా ఉంటాయి.
ఈ వ్యాధి ఎక్కువగా ఉష్ణ మండల వాతావరణంలో కనిపిస్తుంది. పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో అధికంగా ఉంటుంది. “డెంగ్యూ వైరస్ అనేక అంటురోగాలకు కారణమవుతుంది. బాధితుల్లో చాలా వరకు తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. తీవ్రమైతే డెంగ్యూ ప్రాణాంతక సమస్యగా మారుతుంది” అని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.