telugu navyamedia
ఆరోగ్యం

ముంచుకొస్తోన్న ద‌ర్డ్ వేవ్‌..

పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్, ఒమిక్రాన్ కేసులు
ఒమిక్రాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం
మాస్కుతో బయటకు రావాలని విన్నపం

ప్రపంచదేశాల్లోగాకుండా… దేశీయంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు మూడో ముంపు ముంచుకొస్తోందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఒమిక్రాన్ కేసులు వేగవంతంగా వ్యాప్తిచెందుతున్నాయన్నారు.

కోవిడ్ పాజిటివ్ కేసులతోపాటు ఒమిక్రాన్ కేసుల పెరుగుదలపై ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఒమిక్రాన్ విస్తృతిని నియంత్రిస్తూ… సమర్థవంతంగా సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తపడాలని సూచించారు.

సంక్రాంతి పండుగ మూడో వేవ్​కు ప్రారంభమని.. రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయని వెల్లడించారు. కేసులు పెరిగినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఒమిక్రాన్​ సోకిన వారిలో 90 శాతం లక్షణాలు లేవని వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా సామాజిక వ్యాప్తి చెందుతోందని.. డెల్టా వేరియంట్ కంటే ఇది 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు.

Related posts