telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

డ్రింకింగ్ వాటర్ లోనూ కరోనా.. అసలు నిజం ఇదే!

చైనాలో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాలను అతలాకుతలం చేస్తోంది. అయితే ఈ వైరస్ ఎలా, ఏవిధంగా ఇంత తొందరగా వ్యాపిస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. మొత్తానికి ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా కరోనా వ్యాప్తిపై సీసీఎంబీ సంచలన వ్యాఖ్యలు చేసింది.డ్రింకింగ్ వాటర్ లోనూ కరోనా వైరస్ రెండు రోజుల పాటు బతికి ఉండే అవకాశం ఉందని సీసీఎంబీ వెల్లడించింది. 4 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చల్లని నీటిలో వైరస్ కు ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉంటుందని ఇది వేడి నీళ్ళలో 65 డిగ్రీల వద్ద వైరస్ నిమిషాల వ్యవధిలోనే చనిపోతుందని తెలిపింది. అయితే తాగునీటి వల్ల వైరస్ బారిన పడిన కేసులు మన దేశంలో ఎక్కడా నమోదు కాలేదని ముందు జాగ్రత్తగా వెచ్చని నీటిని, వేడి పదార్థాలను తీసుకోవడం మంచిదని సీసీఎంబీ వెల్లడించింది. కావున ఇక నుంచైనా అందరూ జాగ్రత్త పడండి.

Related posts