telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కలిసొస్తున్న కాంబినేషన్.. కిల్లర్ గా ప్రభుదేవా, జంటగా తమన్నా..

khamoshi

క్రైమ్ థ్రిల్లర్ ‘ఖామోషి’ లో మిల్కీ బ్యూటీ తమన్న భాటియా లీడ్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ కొరియో గ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా చిత్రకారిణి పాత్రలో నటిస్తోంది. భూమిక మరో కీలక పాత్రలో నటిస్తోంది. చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 31 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

గతంలో ఈ కాంబినేషన్ లోనే ‘అభినేత్రి’ అటు తమిళంలో ఇటు తెలుగులో అద్భుతమైన కమర్షియల్ సక్సస్ ను సాధించింది. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘అభినేత్రి-2’ కూడా రూపొందబోతోంది. అందుకే తమన్న-ప్రభుదేవ కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొల్పింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే 2016 లో రిలీజ్ అయిన హాలీవుడ్ థ్రిల్లర్ ‘హష్’ కు కాపీ అనే మాట వినిపిస్తోంది. ‘ఖామోషి’ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది నెటిజనులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయితే కానీ మనకు ఈ విషయంపై ఫుల్ క్లారిటీ రాదు. ఏదేమైన ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రస్టింగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts