telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్ర బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ కు మొండిచేయి…

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ మమ్మల్ని నిరాశ పరిచిందని… ఆంధ్రప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమను చూపించారని మండిపడ్డారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే ప్రయోజనాలు కాపాడారని.. ఇది తమిళ నాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు మొండిచేయి చూపించారని…పోలవరం సవరించిన అంచనాలపై మాట్లాడలేదన్నారు. మెట్రో ప్రాజెక్టు పై కూడా మాట్లాడ లేదని… ఫ్రైట్ కారిడార్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఎక్కువ కిసాన్ రైళ్లను వేయాలని కోరామని…కానీ దాన్ని పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక హోదాను బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని…నేషనల్ వైరాలజీ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో “టెక్స్ టైల్” పార్కు ఏర్పాటు చేయాలని… మరిన్ని vistadome coachలను వేయాలని కోరారు. దాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని…ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. లక్ష రూపాయల వరకు పన్ను మినహాయించాలని… అప్పులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఖర్చు చేయాలన్నారు. ద్రవ్యోల్బణం పెరిగినా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారని…ఒక్క ఫిషింగ్ హార్బర్ ఇవ్వడం పెద్దగా చెప్పుకోదగ్గ అంశం కాదని తెలిపారు.

Related posts