telugu navyamedia
ఆరోగ్యం

దేశంలో కరోనా త‌గ్గుముఖం..

భారత్ లో థర్డ్‌వేవ్ త‌గ్గ‌ముఖం ప‌డుతుంది. కరోనావైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 34,113 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా 346 మంది  ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో ప్ర‌స్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతం మరియు వీక్లీ పాజిటివిటీ రేటు 3.99 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 4,78,882 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,21,56,523 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,09,011 బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది.

భారతదేశం యొక్క యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 1.12 శాతంగా ఉండ‌గా ..రికవరీ రేటు ఇప్పుడు 97.68 శాతంగా ఉంద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మ‌రోవైపు వ్యాక్సినేషన్ ముమ్మ‌రంగా సాగుతుంది. కొత్తగా 11,66,993 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,95,87,490 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Related posts