telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కిడ్ని స్టోన్స్‌ ఉన్నవారు ఇలా చేయండి…

tips for healthy kidneys

మన శరీరంలోని విసర్జక మండలంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనకు అవసరమైన వాటిని వుంచుతూ, అనవసరమైన వాటిని బయటకు పారదోలుటకు రక్తాన్ని వడకట్టుతాయి. మౌనంగా పనిచేస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు కొన్ని ముదిరిపోయేదాకా తెలియదు. ఎందుకంటే చివరిక్షణం వరకూ మూత్రపిండాలు పనిచేస్తాయి. ఆఖరుకు కిడ్నీ అంతా పాడైపోయినపుడే పనిచేయటం మానివేస్తాయి.
ఈ మధ్య మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. వేసవి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలోని నీటిశాతం తగ్గి, లవణాల గాఢత పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉండడటమే
#కారణాలు :
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మూత్రవయావాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌. నీరు తగినంత తాగకపోవడం. ఆహారపు అలవాట్లు. కొన్ని న్యుపరమైన ఇన్‌ఫెక్షన్లు.
#పరీక్షలు
1. అల్ట్రాసౌండు – కడుపు పరీక్షలు
2. ఐ.వి.పి. (ఇంటావీనస్ ఫైలోగ్రామ్)
3. ‘X’ రే కడుపు మూత్రనాళము – మూత్రాశయ భాగాలు (కె.ము.బి)
4. యమ్.ఆర్.ఐ (MRI) కడుపు/మూత్రపిండాలు
5. మూత్ర పరీక్షలు
ఈ పరీక్షల వలన మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షను, మూత్రనాళాలు మూసుకుపోవడం, మూత్రపిండ కణాలు దెబ్బతినడం,వ్యత్యాసం కనుగొనవచ్చును.
#నివారణ
రోజుకు 8-13 గ్లాసుల నీళ్లు తాగాలి.
కాల్షియం, ఆగ్జలేట్స్ కలిగిన ఆహారాలను తీసుకోవద్దు. ఉదాహరణకు యాపిల్స్, మిరియాలు, చాక్లెట్స్, కాఫీ, ఛీజ్, ద్రాక్ష, ఐస్‌క్రీమ్, విటినరుగు, టమటా, కమలాపండ్లను మానేయటం గాని బాగా తగ్గించటం గాని చేయాలి.
ఆహారంలో జంతు మాంసాలను తగ్గించాలి.
ఉప్పు వాడకాన్ని కూడా రోజుకు 2-3 గ్రాములకు తగ్గించాలి.
విటమిన్-సి, డిలను సప్లిమెంట్ల రూపంలో యధేచ్చగా తీసుకోవద్దు.
మద్యం అలవాటు ఉంటే మానేయాలి.
#నవీన్_గృహ_చికిత్సలు
*పసుపును, బెల్లాన్ని కలిపి వరిపొట్టు లేదా ఊకతో కాచిన నీళ్లు తాగితే మూత్రమార్గపు రాళ్లరేణువులు పడిపోతాయి .
*పల్లేరు కాయలు (గోక్షుర) సేకరించి, నీడలో ఎండబెట్టి మెత్తగా నూరి, పొడి చేసి వస్తగ్రాళితం పట్టి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని అర టీస్పూన్ తేనె కలిపి, గొర్రె పాలతో వారంపాటు తీసుకుంటే మూత్రపిండాల రాళ్లు కరిగిపోతాయి
*కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో కొద్దిరోజులు తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రేణువులు పడిపోతాయి.
*దోసగింజలను, కొబ్బరిపువ్వునూ పాలతో నూరి తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్లు, చిన్నచిన్న రేణువులు పడిపోతాయి.
*పొద్దుతిరుగుడు ఆకులను ముద్దగా నూరి ఆవు పాలతో పది రోజులపాటు ఉదయం, ప్రభాత సమయంలో తీసుకుంటే తీవ్రమైన రాళ్లుకూడా చిన్న చిన్న తునకలుగా పగిలి వెలుపలకు వచ్చేస్తాయి
*కరక్కాయల గింజలను నూరి పాలకు కలిపి మరిగించి తీసుకుంటే నొప్పితో కూడిన మూత్రపిండాల రాళ్లు, రాళ్ల రేణువులు బయటకు వెళ్లిపోయి ఉపశమనం లభిస్తుంది
*దోశగింజలనూ నక్కదోశ గింజలనూ ముద్దగా నూరి ద్రాక్షపండ్ల రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*బూడిద గుమ్మడికాయలు, బూడిదగుమ్మడిపూల స్వరసంలో యవక్షారాన్ని, బెల్లాన్నీ కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*పల్లేరు గింజల చూర్ణాన్ని తేనెతో కలిపి ఏడు రోజులు గొర్రెపాలతో తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*మునగచెట్టు (శిగ్రు) వేరును ముద్దగా నూరి ఒక రాత్రి పాటు నీళ్లలో ఊరబెట్టి తీసుకుంటే మూత్రమార్గంలోని రాళ్లు పడిపోతాయి
*చేదు ఆనపకాయ గింజల (కటుతుంబీ) చూర్ణాన్ని తేనెతో కలిపి గొర్రెపాలతో ఏడు రోజులపాటు తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
#చికిత్స
1. మూత్రపిండాలలో రాయి సైజు 5 mm లోపు వుందని నిర్దారించినపుడు, సాధారణంగా మూత్రం
ద్వారా వెలుపలకు వస్తుంది
2.శస్త్రచికిత్స :
కొన్ని మూత్రపిండాల్లోని రాళ్ళను తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరం. మూత్రకోశ వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ శస్త్రచికిత్స చేయించుకుని, రాళ్ళను తొలగించుకోవాలి. శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల పాటు ఆస్పత్రిలో వుండాలి. ఆరు నుండి పన్నెండు వారాల విశ్రాంతి అవసరం. తరువాత మూత్రపిండంలో రాళ్లు తయారవకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
3. ఐదు (5) mm కన్నా పెద్దగా వున్న రాళ్ళు తనంత తానుగా వెలుపలకు రావు కాబట్టి తప్పని సరిగా లితోట్రెప్సి ద్వారా కాని, ఆపరేషన్ ద్వారా కాని తీసివేయవలసిన అవసరం ఉంటుంది
4. యారెటరోస్మోపి, పర్ క్యూటీనియస్ నెఫ్రోలితోటమీ, లితోక్లాస్ట్, లేజర్స్ అనే అధునాతన పద్దతుల ద్వారా మూత్రపిండాల రాళ్లను తీసివేయవచ్చును
ఔషధాలు

Related posts