telugu navyamedia
ఆరోగ్యం

శ‌న‌గ‌లు తింటే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు..

శ‌న‌గ‌లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని వైద్య‌లు సూచిస్తున్నారు. వీటిని ప‌చ్చిగా లేదా వేయించుకొని తిన‌వ‌చ్చు..శనగలు తింటే ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తాయి. ఎందుకంటే వీటిల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అలాగే విటమిన్ కె వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అన్ని పోషకాలు శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి అవసరం. కాల్షియం లేమితో బాధపడేవారు శనగలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ముఖ్యంగా.. మాంసం (శాఖాహ‌రులు) తిన‌లేనివారికి శ‌న‌గ‌లు అద్భుత‌మైన ఆహారం అనే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే శ‌న‌గ‌ల్లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. నిత్యం ఒక క‌ప్పు శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

How to Control High Blood Pressure in winter?

హైబీపీ కంట్రోల్‌
ఒక కప్పు శ‌న‌గ‌ల ద్వారా మ‌న‌కు సుమారుగా 474 మిల్లీగ్రాముల పొటాషియం ల‌భిస్తుంది. పొటాషియం మ‌న శ‌రీరంలో బీపీని నియంత్రిస్తుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. అందువ‌ల్ల నిత్యం శ‌న‌గ‌ల‌ను తింటే హైబీపీ త‌గ్గుతుంది. అలాగే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌..
డయాబెటిస్ ఉన్న‌వారికి శ‌న‌గ‌లు మంచి ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా త‌క్కువ‌. అంటే వీటిని తింటే రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ వెంట‌నే పెర‌గ‌వు. పైగా వీటిలో ఉండే ఫైబ‌ర్ నెమ్మ‌దిగా జీర్ణం అవుతుంది. అందువ‌ల్ల ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా ఉంటాయి. ఫ‌లితంగా డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

Skipping breakfast may put diabetics at risk of dangerous blood sugar spikes, warn researchers

బరువు తగ్గడం ..

వీటిలో ఎక్కువగా ప్రొటీన్, పీచుపదార్థం ఉండటం వల్ల శనగలు బరువు తగ్గడానికి సరిపడే ఆహారం. ప్రొటీన్, పీచుపదార్థం రెండూ కడుపు నింపి, ఎక్కువసేపు ఆకలి లేకుండా చేసి, బరువు ని కంట్రోల్ లో ఉంచుతుంది. కాబట్టి డైట్ చేసే వారు వీటిని ఎక్కువగా తీసుకోవచ్చు. వీటిని ఎలా తిన్నా శరీరానికి అవసరమైనవి సమకూరుతాయి.

This One Change Can "Significantly" Boost Your Weight Loss, New Study Says | Eat This Not That

రక్త హీనతకు రాకుండా

ఐరన్, క్యాల్షియం, అన్ని రకాల విటమిన్లు, ఫొలేట్, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాహలతో నిండిన శనగలు మన శరీరంలో ఎముకలు గట్టి పడేలా చేస్తాయి. మన శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేసే ఈ గింజలు, ఆస్టియోపోరాసిస్, అనీమియాతో బాధపడేవారికి శనగలు మంచి ఆహారం.

నిద్ర కోసం..

చ‌క్క‌గా నిద్ర ప‌ట్టేలా చేయడం లో శనగలు కి ప్రత్యేక స్థానం.. అంతేకాదు ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గిపోతాయి. నిద్ర లేమి సమస్యలు ఉండవు. 

14 Foods That Help You for Good Sleep at Night

శ‌న‌గ‌ల‌తో ఉప‌మోగాలు..
*శ‌రీరానికి ఐర‌న్ అందిస్తాయి.
*జీర్ణక్రియ మెరుగువుతుంది.
*శ‌రీరంలో చెక్క‌ర స్థాయిని అదుపులో ఉంచుతాయి.
*గుండెలో ర‌క్త‌నాళాలు మూసుకుపోయే ప్ర‌మాదాన్ని త‌గ్గిస్తాయి.
*యాంటి ఆక్సిడెంట్లుగా ప‌ని చేస్తాయి.
*రొమ్ము క్యాన్స‌ర్ స‌మ‌స్య‌ల‌ను అదుపులో ఉంచుతాయి.
*నిద్ర‌లేమి, జుట్టురాల‌డం, త‌ల‌నొప్పి స‌మ‌స్య‌లు తగ్గుతాయి.

Related posts