విరిసిన హృదయ ప్రేమ
కమలానివో!
అంబుధి ఒడిలో ఉదయించిన అరుణోదయానివో!
కడలి తీరాన నిలిచిన సాగర కన్యవో!
సాహసవీరుని వలచి వచ్చిన అతిలోకసుందరివో!
పురివిప్పి నర్తించే మయూరానివో!
విరహంతో విహరించే వలపుల సీతాకోకచిలుకవో!
పరవశంతో రెక్కలు చాపిన ప్రేమ పావురానివో!
బాపు గీసిన ప్రణయ చిత్రానివో!
పచ్చని నా ప్రేమ పత్రానివో!
నా మనోనేత్రానివో! సూత్రానివో!
కొండపల్లి రమణీయ బొమ్మవో!
నా మది మ్రానుపై ప్రేమ కొమ్మవో!
తనువు తరువులో వలపుల రెమ్మవో!
నా ముంగిట వెలసిన ప్రేమ దేవతవో!
నన్ను కరుణింప వచ్చిన కలల రాకుమారివో!!
చిరు దరహాసాల దొర సానివో!
నా మనసు గగనాన ప్రేమ బింబానివో!
తేజోమయ సూర్యబింబానివో!!
ఎవరివో!…నీవెవరివో!!..
చెప్పవా! చెలియా!!
మనసు విప్పవా ప్రియా!!
-గద్వాలసోమన్న, ఎమ్మిగనూరు