telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తన పేరుతో ఏర్పాటు చేసిన సంఘాలను రద్దు చేసుకోవాలి: కేటీఆర్

KTR Counter pawan comments

తన పేరుతో ఏర్పాటు చేసిన సంఘాలను రద్దు చేసుకోవాలని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. కేటీఆర్ యువసేన, కేటీఆర్ సేవాదళ్, కేటీఆర్ అభిమాన సంఘం వంటి పేర్లతో పలువురు సంఘాలను ఏర్పాటు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటిని తాను ఆమోదించబోనని తెలిపారు. తన పైన, పార్టీ పైన అభిమానంతో ఏర్పాటు చేసే సంఘాలకు సైతం తన ఆమోదం లేదన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో తన పేరుతో ఏర్పాటు చేసిన సంఘాలను వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు.

దీంతో పాటు ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ కేటీఆర్ యువసేన, కేటీఆర్ అభిమాన సంఘం వంటి వివిధ పేర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు సైతం వాటిని వెంటనే ఆపేయాలని కోరారు. పార్టీ పైన, తన పైన అభిమానం ఉంటే కేసీఆర్ నాయకత్వంలో టీఆరెస్ పార్టీతో కానీ, అనుబంధ సంఘాలతో కానీ కలిసి పనిచేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.

Related posts