వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకగ్రీవంగా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు చేశామని క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఉదయం ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ జరిగింది. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి డీవీ మానర్ హోటల్ వరకు రన్ ప్రారంభమైంది. మంత్రులు ధర్మాన కృష్ణ దాస్, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒలింపిక్ రన్‌లో క్రీడాకారులు అందరూ ఉత్సాహంతో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. ఒలింపిక్ అసోసియేషన్‌లో గత నాలుగేళ్లల్లో ఎన్నో రాజకీయాలు, వివాదాలు నడిచాయన్నారు. మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. నూతన ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్‌గా విజయసాయి రెడ్డి, అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణ దాస్‌ను ఎన్నుకోవడం జరిగిందన్నారు.