telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఇటలీలో మళ్లీ ఉద్ధృతమైన కరోనా.. 24 గంటల్లో 1000 కేసులు

corona vairus

కరోనా వ్యాప్తి ప్రారంభమైన తొలిరోజుల్లో ఇటలీలో తీవ్రంగా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అక్కడ 2.57 లక్షల కరోనా కేసులు రాగా, 35 వేల మంది వరకు మరణించారు.

 కరోనా ఉద్ధృతి ఇటలీలో పతాకస్థాయికి చేరినట్టనిపించింది. అయితే ఆ తర్వాత ఎంతో శ్రమించిన ఇటలీ ప్రభుత్వం మే రెండో వారానికి సాధారణ స్థితికి తీసుకురాగలిగింది. చివరిగా మే 12న 1000 పైగా కేసులు రాగా, ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు 1000 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,071 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇటలీ యంత్రాంగం ప్రాముఖ్యతనిచ్చింది. కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే ఇటలీ లాక్ డౌన్ ఎత్తేసింది అప్పటినుంచి నిత్యం వెయ్యికి లోపే కేసులు వస్తున్నాయి.

తాజాగా మళ్లీ కేసులు పుంజుకుంటుండడం పట్ల అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 17 నుంచి నైట్ క్లబ్బులు మూసివేయాలని నిర్ణయించారు.

Related posts