telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పార్టీ ఏదైనా ప్ర‌జ‌ల ప‌క్షానే.. మురికి కాల్వలోకి దిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

రైల్వే, మున్సిపల్ అధికారుల తీరుని నిరసిస్తూ మంగళవారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురుగునీటి కాలువలోకి దిగారు.

21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందన్నారు.

అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి కూడా అధికారులతో మాట్లాడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార విషయంలో అధికారమా? ప్రతిపక్షమా? అనేది ఉండదని.. ప్రజల పక్షాన ఉంటానని స్పష్టం చేశారు.

రైల్వే అధికారుల మొండి తీరు, కార్పొరేషన్ అధికారుల నత్తనడకని ప్రశ్నిస్తూ మురుగు గుంతలోకి దిగుతున్నానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.

రైల్వే అధికారుల నిరంకుశ వైఖరిని, కార్పొరేషన్ అధికారుల నత్తనడకని విమర్శిస్తూ తాను మురికి గుంటలో దిగుతున్నానని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు అక్కడినుంచి కదిలేది లేదన్నారు.

అప్పట్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం గతంలో ఓసారి మురికి కాల్వలో దిగి నిరసన తెలిపారు.

తాజాగా మరోసారి డ్రైనేజీలోకి దిగి ఎమ్మెల్యే నిరసన తెలపగా.. వద్దు సార్ బయటకు వచ్చేయండంటూ స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆయన వేడుకుంటున్నారు. ఆయన మాత్రం తగ్గేదేలే అంటూ మురికి కాల్వలోనే కూర్చుని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తానని చెప్పారు

Related posts