కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి బ్రిజేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సభలో స్థానిక నేత ఒకరు కరెన్సీ నోట్లను జనం మీదకు వెదజల్లారు. నియోజకవర్గంలోని సిరివెళ్లలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకొంది.
ఈ డబ్బును తీసుకొనేందుకు జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో కొందరు గాయపడినట్టుగా చెబుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే బ్రిజేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆళ్ళగడ్డ టీడీపీ అభ్యర్ధి, మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఈసీకి కూడ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
కనగరాజ్‌ను క్వారంటైన్ కు పంపించాలి: వీహెచ్