telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఏకంగా 9 పెళ్లిళ్లు చేసుకుంది… చివరకు తొమ్మిదో భర్త చేతిలో ఇలా…!

ninth-Husband

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇతర వ్యక్తులతో పరిచయం పెంచుకుంది..వారితో సన్నిహితంగా మెలిగేది..ఈ విషయం 9వ భర్తకు తెలిసింది. వారించాడు. వినిపించుకోలేదు. చివరకు ఆమెను హత్య చేశాడు. విచారణలో ఇలాంటి విస్తు గొలిపే విషయాలు వెలుగు చూశాయి. పహాడీషరీఫ్ పీఎస్ ఎస్ఐ కుమార స్వామి తెలిపిన వివరాల ప్రకారం…కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు మూడు సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపల్ పరిధిలోని శ్రీరామ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతను క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే వరలక్ష్మీ (30)తో పరిచయం ఏర్పడింది. ఈమె కాటేదాన్ పారిశ్రామిక వాడలో పెట్రోల్ బంక్ లో పని చేస్తుండేది. ఈమెకు భర్త, ఓ కుమారుడున్నాడు. నాగరాజు – వరలక్ష్మీ మధ్య ఉన్న పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం భర్తను వదిలేసిన వరలక్ష్మీ… నాగరాజును పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు వీరి సంసారం బాగానే సాగింది. అనంతరం కొత్త కొత్త వ్యక్తులతో వరలక్ష్మీ పరిచయం చేసుకోవడం, వారితో సన్నిహితంగా మెలగడం నాగరాజు గమనించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. మూడు రోజుల క్రితం మళ్లీ గొడవ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున గొడవ పెద్దది కావడంతో… ఆవేశంలో నాగరాజు కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. నేరుగా పహాడీషరీఫ్ పీఎస్ వద్దకు వచ్చి లొంగిపోయాడు. దర్యాప్తులో వరలక్ష్మీ 8 మందిని పెళ్లి చేసుకుందని తేలింది. నాగరాజు 9 భర్త అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Related posts