telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనూసూద్ కు వెల్లువలా పుట్టినరోజు శుభాకాంక్షలు… పుట్టినరోజున మరో మంచి పనికి రియల్ హీరో శ్రీకారం

Sonu-Sood

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న ఈ రియల్ హీరో సోనూసూద్ పుట్టిన రోజు జూలై 30న. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1973 సంవత్సరం జులై 30న జన్మించిన సోనూ సూద్ నేటితో 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఇక సోనూ తన పుట్టిన రోజు సందర్భంగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కొవిడ్-19 నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకుంటూ దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభిస్తున్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. ఇక ఇటీవలే చిత్తూరు జిల్లాకు చెందిన పేద రైతుకు ట్రాక్టర్ కొనిచ్చారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటోన్న వరంగల్ యువతి శారదకు ఉద్యోగం ఇప్పించారు.

Related posts