సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు సర్వం సిద్ధమవుతోంది. అన్ని రాజకీయపార్టీలు తమ తమ ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నారు.
అందులో భాగంగానే ప్రచారసభలతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.
స్వయంగా ఓటర్ల దగ్గరకు వెళ్లేందుకు ఆ పార్టీ అభ్యర్థులు కొన్నిసార్లు వీలుకాకపోవచ్చు. కానీ ప్రస్తుతం అందరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. అందులో సోషల్ మీడియా యాప్స్ వినియోగిస్తున్నారు.
దాంతో పార్టీలు ప్రచార పద్ధతులును మార్చుకుంటున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ప్రచారసాధనాలుగా ఉపయోగించుకుంటున్నాయి.
ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. గతంలో భాజపా 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం రూ.325 కోట్లు ఖర్చు చేయగా, వారి కంటే ఎక్కువుగా కాంగ్రెస్ రూ.356 కోట్లు ఖర్చు చేసింది.
కొవిడ్-19 వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల సంఖ్య బాగా పెరిగింది. వాళ్లకు ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూలను పార్టీ అనుకూల ప్రచారానికి మాధ్యమాలుగా మార్చుకుంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రచారం లేకుండా గెలిచే పరిస్థితి లేదని పార్టీలు గట్టిగా నమ్ముతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా, నియోజకవర్గాల వారీగా పార్టీలు బృందాలను ఏర్పాటు చేసుకుని ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఓటర్లను నేరుగా కలవకుండా.. ఏఐ సాంకేతికతతో సంభాషించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా సోషల్ మీడియా ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి వాటిపై నిఘా పెట్టింది.
“కాళేశ్వరం” కు జాతీయ హోదా దక్కకుండా చేసిన పాపం కాంగ్రెస్‌దే: మంత్రి హరీశ్ రావు